
- GATA gives you a platform to expose your talent - members get the priority. You may organize, coordinate or participate in ...
- GATA PalleSandadi from August 26th to 28th @ A. H. Stephens State Park
- GATA Ugadi Event: 9th April 2022, 4- 7 PM @ DeSana Middle School
- GATA Badminton Tournament : April 9th ( All Day )

President Message

సంకల్పం మాది
సహకారం మీది
విజయం మనందరిది..
శుభమస్తు.శ్రీరస్తు . నమస్కారం .తెలుగు వారందరికీ GATA వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఒక పుష్కరం క్రితం మొదలయి, బొట్టూ బొట్టూ కలిసిన ఒక జీవ నదిలా సాగుతూ, తెలుగు తల్లికి వందనాలిడుతూ, భారతీయ సంస్కృతిని తర్వాతి తరాలకు చాటుతూ, తెలుగు జాతి కీర్తిని ప్రతి మదిన నాటుతూ అడుగడుగున తెలుగుదనపు సాంప్రదాయాన్ని మీటే GATA సంస్థకు 2022వ సంవ్సరానికి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతను చేపట్టడం నన్ను వరించిన దివ్యావకాశంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన GATA వ్యవస్థాపక సభ్యులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
తెలుగు వారి అభ్యున్నతికి పాటుపడుతూ ఈ నూతన సంవత్సరంలో సాంప్రదాయబద్ధంగా మరికొంత వినూత్నంగా తెలుగు వారందరినీ అలరించాలన్నదే నినాదమై GATA ముందుకు సాగగ పూనుకుంది అని నూతన అధ్యక్షునిగా సగర్వంగా తెలియచేస్తున్నాను.
ప్రకృతికి ఎదురెళ్ళకుండా మరియు పరిస్థితులకి తలవంచకుండా సమయస్ఫూర్తితో సకల జన సుభీష్టాన్ని కోరుకుంటూ, తెలుగు తల్లి సంస్కృతిని చాటుతూ, GATA సంస్థ వ్యవస్థాపకులు, దాతలు, కళాకారులు, కార్యకర్తలు , సభ్యులు మరియు తెలుగు వారందరి గౌరవం ద్విగుణీకృతం అయ్యేలా విజ్ఞాన, వైద్య, విద్య, సాంస్కృతిక, సాహిత్య, క్రీడా మరియు సాంఘిక సేవలకు సంబంధించిన పలు కార్యక్రమాల రూపకల్పన చేస్తూ పలు అంశాల పట్ల అవగాహనా సదస్సులు నిర్వహించడం వంటి పలు ప్రణాళికలను చేపడతామని అందుకు భగవత్కృప మరియు తెలుగుజాతి ప్రియ బంధుజన తోడ్పాటు ఉంటుందని ఆశిస్తున్నాను.
ఆసక్తికర కళలకు కళావేదికయై , ఆపద సమయంలో ఆపన్నహస్తమై , ఆనందంలో అత్మానుబంధమై. అట్లాంటాలోని తెలుగు వారందరికీ ఆత్మీయ బంధమై GATA సంస్థ సర్వత్రా సర్వదా వెన్నంటి ఉండేలా కృషి చేస్తుందని GATA 2022 chief coordinator గా నావంతు నేపథ్యాన్ని నేను దీక్షాపరుడనై నిర్వహిస్తానని మనస్పూర్తిగా తెలియచేస్తున్నాను..
ఈ సందర్భంగా GATA సంస్థకు నిర్విరామ సహకారాన్ని, ప్రోత్సాహాన్ని అందజేస్తున్న వ్యవస్థాకులకు, ఆర్థిక - సాంకేతిక సహకారదారులకు, కార్యకర్తలు మరియు EC బోర్డు సభ్యులకు పేరుపేరునా నా హృదపూర్వక అభినందన మాలలు సమర్పిస్తున్నాను.
ఈ సహృదయ సహకారం రానున్న కాలంలోనూ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను.
సర్వే జనా సుఖినోభవంతు🙏
భవదీయుడు